Chinturu: కోలుకుని ప్రచారంలోకి వచ్చిన టీడీపీ మండల అధ్యక్షుడు జమాల్ ఖాన్!

Chinturu: చింతూరు మండల టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ జమాల్ ఖాన్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి ప్రచారం ప్రారంభించారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 1 Nov 2026 11:01 AM IST
Chinturu
X

Chinturu: కోలుకుని ప్రచారంలోకి వచ్చిన టీడీపీ మండల అధ్యక్షుడు జమాల్ ఖాన్!

Chinturu: అనారోగ్య కారణాలతో కొద్దిరోజులు ప్రచారానికి దూరంగా ఉన్న చింతూరు మండల టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ జమాల్ ఖాన్ శనివారం నుంచి తిరిగి ప్రచారం ప్రారంభించారు. ఆయన తిరిగి రావడంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో జోరు పెరిగింది.

ఆదివారం పేగా ఎంపీటీసీ పరిధిలోని సూరకుంట గ్రామంలో 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పేగా ఎంపీటీసీ అభ్యర్థి సున్నం పార్వతి, సూరకుంట పటేల్ తోడేం రామయ్య, గ్రామ పూజారి తోడేం మల్లేశ్వరరావు, కట్టం అశోక్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు.

వారికి మండల అధ్యక్షుడు జమాల్ ఖాన్, మాజీ అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నట్లు చేరికలైన వారు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను జమాల్ ఖాన్ దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన ఆయన సమస్యలను రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR