Chintoor: చింతూరు డివిజన్లో 4 జడ్పీటీసీ స్థానాలకు 33 నామినేషన్లు దాఖలు!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు డివిజన్లోని 4 జడ్పీటీసీ స్థానాలకు 33 నామినేషన్లు దాఖలయ్యాయి. బీ-ఫామ్స్ ఎవరికి దక్కుతాయోనని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.
Chintoor: చింతూరు డివిజన్లో 4 జడ్పీటీసీ స్థానాలకు 33 నామినేషన్లు దాఖలు!
Chintoor: చింతూరు డివిజన్ లోని చింతూరు, వరరామచంద్రాపురం, ఎటపాక, కూనవరం మండలాల జడ్పిటిసి స్థానాలకు 33 నామినేషన్ దాఖలు అయ్యాయి.చింతూరు జడ్పిటిసి స్థానానికి 7 నామినేషన్లు, కూనవరం జడ్పిటిసి కి 14 నామినేషన్లు,వరరామచంద్రపురం జడ్పిటిసి కి 7 నామినేషన్లు, ఎటపాక జడ్పిటిసి స్థానానికి 5 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
జడ్పిటిసి స్థానాలకు పార్టీల నుండి నామినేషన్లు వెల్లువగా రావడంతో బరిలో నిలిచే అభ్యర్థి ఎవరో అంటూ పార్టీ కార్యకర్తలలో ఉత్కంఠ నెలకొంది.నామినేషన్ విత్ డ్రా సమయంలోగా ఆయా పార్టీల నుంచి బీఫామ్ పొందిన వారు బరిలో నిలబడటం జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
బి ఫాం పొందని అభ్యర్థులు పోటీ నుంచి విత్ డ్రా అవ్వాలని, లేని పక్షంలో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుందని నేతలు చెబుతున్నారు. విత్ డ్రా సమయానికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.




