Eluru: చిగురుమామిడిలో అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన బాధితులకు 'పిన్ని ఫేయిత్ మినిస్ట్రీ' భరోసా!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం చిగురుమామిడిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Eluru: చిగురుమామిడిలో అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన బాధితులకు 'పిన్ని ఫేయిత్ మినిస్ట్రీ' భరోసా!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల పరిధిలోని చిగురుమామిడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చండ్రుగొండ నరసింహులు, రవి, సింగబాబు, శ్రీనులకు చెందిన నాలుగు తాటాకుల ఇండ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అగ్ని ప్రమాదంలో ఇడ్లలో ఉన్న సామన్లు పూర్తిగా కాలి బూడిద అయి బాధితులు కట్టుబట్టలతో మిగిలారని తెలియడంతో ఏలూరు పిన్ని ఫేయిత్ మినిస్ట్రీ రెవ.పిన్ని అబ్రహం, పిన్ని ఫేయిత్ మినిస్ట్రీ సభ్యులు, జిఎస్.ఈ.ఎల్సి దైవ సేవకులతో కలిసి బాధిత కుటుంబాలను పరమర్శించి, నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, వంట సామగ్రి, కొంత నగదు అందజేశారు.
అనంతరం ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెవ.పిన్ని అబ్రహం మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు దాతలు సహాయం అందించాలని, అదేవిధంగా అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ కిరణ్, యాకోబ్, బర్నబాసు, సుధాకర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




