Tadipatri: తాడిపత్రిలో బలవంతపు విత్ డ్రాలు, ఏకగ్రీవాలు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫయాజ్ భాష!
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి ఫయాజ్ భాష సంచలన ఆరోపణలు. బలవంతపు విత్ డ్రాలు, ఏకగ్రీవాలపై ప్రెస్ మీట్.
Tadipatri: తాడిపత్రిలో బలవంతపు విత్ డ్రాలు, ఏకగ్రీవాలు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫయాజ్ భాష!
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నామినేషన్ వేసిన ఫయాజ్ భాష మీడియాతో మాట్లాడుతూ నేను నామినేషన్ వేసిన టైం నుంచి ఇప్పటివరకు తాడిపత్రిలో మున్సిపల్ లో జరిగిన వాటి గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అని నామినేషన్ పత్రాలు తిరస్కరించబడ్డాయి అని వాటిని జిల్లా కలెక్టర్ సీసీ కెమెరా వీడియోలని పరిశీలించి లోపలికి ఎవరెవరు వెళ్లారు ఎందుకు ఏకీగ్రీవం చేశారు అనేది బయటపడతాయని. నా జీవితంలో ఇలాంటి ఎన్నిక ప్రక్రియ ఏనాడు చూడలేదని. మున్సిపాలిటీ వార్డు నెంబర్ గా నామినేషన్ వేసిన అభ్యర్థుల ఇంటి మీద రాళ్లు దాడులు వారిని భయపట్టిచ్చి విత్ డ్రా లు చేపించారని. తాడిపత్రి మున్సిపాలిటీ దేశంలోనే నెంబర్ వన్ గా రాష్ట్రంలో అభివృద్ధి పొందిన మునిసిపాలిటీ ఎన్నో అవార్డులు వచ్చాయని చెప్పుకుంటున్నప్పుడు ఈ బలవంతనపు నామినేషన్లు విత్ డ్రా ఎందుకు ప్రజలు మీకు ఓటు వేరని భయపడుతున్నారా అని తాడిపత్రిలో చాలా సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు తీర్చకుండా 29 వార్డు లు ఏకగ్రీవాలు చేయించారని మున్సిపాలిటీ కమిషనర్ పూర్తిగా అమ్ముడుపోయాడని అని ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి లాస్ట్ టైం సేవ్ తాడపత్రిని అన్నాడు ఇప్పుడు డెవలప్మెంట్ తాడిపత్రి అంటున్నాడు డెవలప్మెంట్ అనేది ఉంటే ఎందుకు ఎలక్షన్లు జరిపించడానికి భయపడుతున్నాడు అని వైఎస్ఆర్సిపి చైర్పర్సన్ అభ్యర్థి తెలిపారు.




