Anantapur: సీపీఐ మద్దతు కోరిన వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్!

Anantapur: అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ నేతలను కలిసి మద్దతు కోరిన వైసీపీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్; 'సేవ్ అనంతపురం' అని పిలుపు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 23 Oct 2026 3:55 PM IST
Anantapur
X

Anantapur: సీపీఐ మద్దతు కోరిన వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్!

Anantapur: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్ సీపీఐ నాయకులను కలిసి మద్దతు కోరారు.నగర అభివృద్ధి కోసం అన్ని వర్గాల వారు కలిసి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వైసీపీకి సీపీఐ మద్దతు తెలుపుతోందని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు నగరానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే, ఎంపీ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.

ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు నగర ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, బాధ్యతను విస్మరించి అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఇతరుల ఆస్తులను ఆక్రమిస్తున్నారని పాలకులపై విమర్శలు చేశారు.ప్రస్తుత పాలకుల తీరుతో ప్రజలు విసిగిపోయారని వైసిపి మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్ పేర్కొన్నారు.

అనంతపురం నగర సమగ్ర అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు, మేధావులు ఆలోచించి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సేవ్ అనంతపురం అనే నినాదంతో ప్రజలు మేధావులు పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వైసిపి మేర అభ్యర్థి రమేష్ గౌడ్ తెలిపారు. బైట్ :- అనంతపురం వైసిపి మేర అభ్యర్థి రమేష్

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM