Kadiri: కదిరిలో జనసేనలో భారీ చేరికలు కండువాలు కప్పి ఆహ్వానించిన భైరవప్రసాద్

Kadiri: కదిరి జనసేన ఆఫీస్‌లో భైరవప్రసాద్ సమక్షంలో తనకల్లు, నల్లచెరువు మండలాల యువకులు చేరిక. పవన్ కళ్యాణ్ సంక్షేమం చూసే చేరామని వెల్లడి.

P.RAHAMTULLA, KADIRI
Published on: 13 Oct 2026 4:10 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో జనసేనలో భారీ చేరికలు కండువాలు కప్పి ఆహ్వానించిన భైరవప్రసాద్

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు ఇన్చార్జి భైరవప్రసాద్ సమక్షంలో తనకల్లు, నల్లచెరువు మండలాలకు సంబంధించిన పలువురు యువకులు పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ సమక్షంలో జనసేనలో చేరారు.పార్టీలో చేరిన వారికి భైరవ ప్రసాద్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలలో చేస్తున్న అభివృద్ధి, తాగునీరు, రోడ్లు,సంక్షేమ పథకాలు చూసి, అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరడం జరిగిందని,పార్టీలోకి చేరిన వారు తెలిపారు. బాలకృష్ణ,వెంకట్ రెడ్డి, గణేష్,కృష్ణారెడ్డి, మౌలాలి, హరినాథ్ తోపాటు వారి తరుపున 30 మంది పార్టీలో చేరారు.

పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి పార్టీ అండదండలుగా ఉంటుందని వారు ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యులు అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కలిసికట్టుగా కృషి చేయాలనీ కోరారు.

ఈ కార్యక్రమంలో తనకల్లు మండల అధ్యక్షుడు కె.వి రమణ,పట్టణ అధ్యక్షులు చలపతి,జయవర్ధన్, కుటల లక్ష్మణ, రామ్మోహన్, సుబ్బయ్య, పలవర శ్రీనివాసులు, అనిల్ కుమార్,తుమ్మల రవీంద్ర,ఇర్ఫాన్,రామచంద్ర, రాజేంద్ర ప్రసాద్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI