Yellanur: యల్లనూరులో టీడీపీ శ్రేణులపై దాడి: ఎమ్మెల్యే పరామర్శ!

Yellanur: అనంతపురం జిల్లా యల్లనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులపై దాడి జరిగింది. గాయపడిన నేత జనార్ధన్ నాయుడును ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పరామర్శించారు.

T SIVASANKAR, ANANTAPUR
Published on: 25 Oct 2026 6:45 PM IST
Yellanur
X

Yellanur: యల్లనూరులో టీడీపీ శ్రేణులపై దాడి: ఎమ్మెల్యే పరామర్శ!

యల్లనూరు: యల్లనూరు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల చివరి రోజు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముందస్తు వ్యూహంతో ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకున్న వైకాపా నాయకులు టీడీపీ శ్రేణులను కవ్వించి, కత్తులు, రాళ్లు, గాజు సీసాలతో దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా, యల్లనూరు మండలం ఎస్. కొత్తపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జనార్ధన్ నాయుడు కూడా గాయపడటంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి జనార్ధన్ నాయుడును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి కత్తులు, రాళ్లు, గాజు సీసాలతో దాడులకు దిగడం అత్యంత హేయమైన చర్య. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడటం పిరికిపంద చర్య. నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా సాగనివ్వకుండా భయానక వాతావరణం సృష్టించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే.

ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించకూడదు.

టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. హింసకు, బెదిరింపులకు భయపడేది లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు స్పష్టం చేశారు.

T SIVASANKAR, ANANTAPUR

T SIVASANKAR, ANANTAPUR