Anantapur: డెడికేటెడ్ కమిషన్ పేరుతో బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోంది!

Anantapur: బీసీలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతోందని అనంతపురం వైసీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య విమర్శలు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 12 Oct 2026 12:33 PM IST
Anantapur
X

Anantapur: డెడికేటెడ్ కమిషన్ పేరుతో బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోంది!

Anantapur: అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీ సంక్షేమం, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం పదేపదే బీసీలను మోసం చేస్తోందని రంగయ్య ఆరోపించారు.డెడికేటెడ్ కమిషన్ పేరుతో అధ్యయనాలు, విచారణలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బీసీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ బీసీల హక్కులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో నీలం సంజీవరెడ్డి, జనార్దనరెడ్డి వంటి నేతల హయాంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, రాజీనామాల అంశాలను ఈ సందర్భంగా రంగయ్య ప్రస్తావించారు. బీసీల హక్కుల సాధన కోసం గతంలో జరిగిన పోరాటాలను గుర్తుచేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో చట్టబద్ధమైన ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM