Yadiki: రాయలచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం!

Yadiki: అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు NH 67 హైవేపై నిలిచి ఉన్న లోడు లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Nov 2026 10:39 AM IST
Yadiki
X

Yadiki: రాయలచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం!

యాడికి: అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు గ్రామంలో NH 67 హైవేపై ఈరోజు తెల్లవారుజామున 5:10 నిమిషాలకు నిలబడి ఉన్న లోడు లారీని తుఫాన్ వాహనం లారీ వెనుక భాగం ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మూర్తి చెందగా. వీరు తాడిపత్రి కావేటిసముద్రం గ్రామానికి చెందిన వీరాంజనేయులు రెడ్డి కుమారుని వివాహం ముగించుకొని హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో వీరాంజనేయులు రెడ్డి, హనుమంత్ రెడ్డి, మల్లికార్జున, సుహాసిని (భార్య భర్తలు), గాయపడిన వారి పేర్లు, పవన్ కుమార్ రెడ్డి, శ్రీదేవి, అనురాధ, రామాంజి రెడ్డి, హైమావతి, అరుణ కుమారి, రాధమ్మ, మొత్తం తుఫాన్ వాహనంలో 12 మంది హైదరాబాదు నుంచి తాడిపత్రి మండలం కావేటి సముద్రానికి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

సంఘటన స్థలాన్ని తాడిపత్రి డిఎస్పి చంద్రశేఖర్ పరిశీలించారు అనంతరం మృతి చెందిన వారిని సంఘటన ఎలా జరిగిందని స్థానికులను యాడికి ఎస్ఐ గోపాల్ ను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్