Gooty: గుత్తిలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపిన వీఆర్ఏలు!
Gooty: అనంతపురం జిల్లా గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన తెలిపిన వీఆర్ఏలు, తక్షణ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్.
Gooty: గుత్తిలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపిన వీఆర్ఏలు!
Gooty: అనంతపురం జిల్లా గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో గురువారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మోకాళ్లపై నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా వీఆర్ఏలకు పే స్కేల్ కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే నామినీలుగా పనిచేస్తున్న వారిని సెటిల్మెంట్ వీఆర్వోలుగా నియమించాలని, అర్హులైన వీఆర్వోలకు 70 శాతం ప్రమోషన్లు కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు వయస్సుతో సంబంధం లేకుండా ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో నిరసన బాట పట్టాల్సి వచ్చిందని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు, సభ్యులు మరియు పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు.




