Anantapur: అనంతపురం మేయర్‌గా రమేష్ గౌడ్‌ను గెలిపించండి
Anantapur: అనంతపురం మున్సిపల్ ఎన్నికల ముగింపు సందర్భంగా వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్, కార్పొరేటర్లకు మద్దతుగా అనంత వెంకట్రామిరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు.
Anantapur: అనంతపురం మేయర్‌గా రమేష్ గౌడ్‌ను గెలిపించండి
అనంతపురం: అనంతపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజున అనంతపురం నగరంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల హాస్టల్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర నేత జగదీష్, మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో దోపిడీ, అవినీతి పెరిగిపోయాయని ఆరోపించారు.సామాన్యులు, వ్యాపారులు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌తో పాటు వైసీపీ, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేసిన వైఎస్ జగన్‌కు, అబద్ధపు హామీలతో పాలన సాగిస్తున్న చంద్రబాబుకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.సీపీఐ రాష్ట్ర నేత జగదీష్ మాట్లాడుతూ.. మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు.
కూటమి కుట్రలను ఐక్యంగా ఎదుర్కొని వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. అనంతపురం నగరానికి అభివృద్ధితో పాటు ప్రశాంతత కూడా అవసరమని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రస్తుత కూటమి పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.
ఢిల్లీ అహంకారానికి.. అనంతపురం ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా మున్సిపల్ ఎన్నికలను అభివర్ణించిన వైసీపీ నేతలు.. మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌తో పాటు అన్ని డివిజన్లలో వైసీపీ, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.




