Gooty: గుత్తిలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి!

Gooty: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్గవ్, పురుషోత్తమ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘోర రోడ్డు ప్రమాదం.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 8 Oct 2026 9:53 AM IST
Gooty
X

Gooty: గుత్తిలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి!

Gooty: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని చెరువు కట్ట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు వెళ్తుండగా, వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గుత్తికి చెందిన భార్గవ్, పురుషోత్తమ అనే యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో భార్గవ్ రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తుండగా, పురుషోత్తమ ఐటీఐ చదువుతున్న విద్యార్థిగా పోలీసులు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL