Anantapur: అనంతపురం ట్రాన్స్‌జెండర్ల ఆవేదన - తప్పు జరిగితే క్షమించండి!
Anantapur: అనంతపురం నగరంలో ట్రాన్స్‌జెండర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఆసిఫ్ అమ్మ, చిట్టెమ్మ మీడియా సమావేశం. వ్యాపారులకు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే క్షమాపణలు కోరిన వైనం.
Anantapur: అనంతపురం ట్రాన్స్‌జెండర్ల ఆవేదన - తప్పు జరిగితే క్షమించండి!
Anantapur: అనంతపురం నగరంలో తాము (ట్రాన్స్ జెండర్స్)ఐదు బ్యాచ్‌లుగా ఉన్నామని, దాదాపు 500 నుంచి 600 మంది వరకు ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారని ఆసిఫమ్మ, చిట్టెమ్మ ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.నగర పరిధిలో తామంతా కలిసి సంపాదన చేస్తున్నామని చెప్పారు.
తమలో ఎవరైనా తప్పు చేస్తే స్వయంగా వెళ్లి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.అంగళ్ల వద్దకు వచ్చి ఎవకైనా వ్యాపారులకు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని కోరారు. వ్యాపారులు, పోలీసులు లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించినట్లు తేలితే.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఇన్నేళ్లుగా అనంతపురం ప్రజల నుంచి తమపై ఎలాంటి ఫిర్యాదులు లేవని చెప్పారు.
అయితే తమలో ఎవరైనా పొరపాటున ఇబ్బంది కలిగించి ఉంటే అందుకు క్షమాపణలు చెబుతున్నామని, అలాంటి చర్యలను తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు.తమ ఆచారాలు, పద్ధతుల ప్రకారమే తాము జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో కొందరు ట్రాన్స్‌జెండర్స్ చేసిన తప్పులను ఆసరాగా చేసుకుని అనంతపురం నగరంలోని తమపై కూడా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
తామూ సమాజంలో భాగమేనని, ప్రతిరోజూ మంచిగా నడుచుకోవాలని ఆసిఫమ్మ తమకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెప్పారు. రోడ్లపైకి వెళ్లినప్పుడు ఎన్నో మాటలు పడుతున్నా వాటిని పట్టించుకోకుండా జీవనం సాగిస్తున్నామని తెలిపారు.




