Anantapur: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ కుట్రలు టీడీపీ నేతలు!

Anantapur: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ కుట్రలకు తెరలేపుతోందని అనంతపురం జిల్లా టీడీపీ నేతలు పూల నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, రమాదేవి ధ్వజం.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 16 Oct 2026 5:50 PM IST
Anantapur
X

Anantapur: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ కుట్రలు టీడీపీ నేతలు!

Anantapur: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే గొడ్డలి పార్టీ కుట్రలకు తెరలేపుతోందని అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ రమాదేవి ఆరోపించారు.అనంతపురంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గత ఐదేళ్ల పాలనలో అరాచకాలకు పాల్పడిన గొడ్డలి పార్టీ.. ఇప్పుడు అదే విధానాలతో ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని విమర్శించారు.రాయచోటి, పుంగనూరు, తిరుపతి, ధర్మవరం ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలను చంద్రబాబు తమకు నేర్పించారని, అయితే జగన్‌మోహన్ రెడ్డి విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.గత ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చినా గొడ్డలి పార్టీకి బుద్ధి రాలేదని విమర్శించారు.ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీ పూర్తిగా భూస్థాపితం కావడం ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM