Kambaduru: కంబదూరులో మాజీ సర్పంచ్ తల్లి లక్ష్మీదేవి మృతి పట్ల సంతాపం!

Kambaduru: కంబదూరు మండలం మాజీ సర్పంచ్ గాజుల శ్రీరాములు తల్లి లక్ష్మీదేవి మృతి. నివాళులర్పించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ నాయకులు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 19 Oct 2026 3:32 PM IST
Kambaduru
X

Kambaduru: కంబదూరులో మాజీ సర్పంచ్ తల్లి లక్ష్మీదేవి మృతి పట్ల సంతాపం!

Kambaduru: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకుడు గాజుల శ్రీరాములు తల్లి లక్ష్మీదేవి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు లక్ష్మీదేవి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

లక్ష్మీదేవి మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, టీడీపీ సీనియర్ నాయకులు చౌలం మల్లికార్జున, కర్లకుంట రామాంజనేయులు, కరణం రామ్మోహన్ చౌదరి, ఆవుల తిప్పేస్వామి, దండా వెంకటేషులు, తలారి ఎర్రిస్వామి, గోళ్ల వెంకటేషులు, మల్లిపల్లి నారాయణ, లింగా సురేంద్ర, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి భర్త బుట్నా తిమ్మరాజు, మల్లారెడ్డి, గోవిందరెడ్డి, గోళ్ల రమేష్ తదితరులు అక్కడికి చేరుకున్నారు.

లక్ష్మీదేవి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాజుల శ్రీరాములును పరామర్శించి, తల్లిని కోల్పోయిన ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గాజుల శ్రీరాములు కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేసిన నాయకులు, లక్ష్మీదేవి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam