Guntakal: గుంతకల్లు మున్సిపాలిటీపై టీడీపీ జెండా.. చైర్‌పర్సన్‌గా యశోద గౌడ్ గెలుపు

Guntakal: గుంతకల్లు మున్సిపాలిటీలో టీడీపీ 24 వార్డులు గెలిచి చైర్‌పర్సన్ పీఠం దక్కించుకుంది. 6,557 ఓట్ల మెజార్టీతో యశోద గౌడ్ విజయం సాధించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 3 Nov 2026 10:23 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లు మున్సిపాలిటీపై టీడీపీ జెండా.. చైర్‌పర్సన్‌గా యశోద గౌడ్ గెలుపు

గుంతకల్లు, అనంతపురం జిల్లా: గుంతకల్లు మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 48 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా 24 వార్డులను కైవసం చేసుకుని మున్సిపాలిటీలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టీడీపీ తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన యశోద గౌడ్ విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 వార్డులకే పరిమితం కాగా, స్వతంత్ర అభ్యర్థులు 7 వార్డుల్లో విజయం సాధించారు. సీపీఐ, బీజేపీ అభ్యర్థులు చెరో వార్డులో గెలుపొందారు.

చైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించి మొత్తం 70,620 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీకి 36,127 ఓట్లు రాగా, వైసీపీకి 29,570 ఓట్లు లభించాయి. దీంతో టీడీపీ 6,557 ఓట్ల మెజారిటీతో ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి 2,326 ఓట్లు, బీఎస్పీకి 308 ఓట్లు, నోటాకు 513 ఓట్లు నమోదయ్యాయి.

మొత్తం చెల్లుబాటైన ఓట్లు 68,331 కాగా, చెల్లని ఓట్లు 1,776గా నమోదయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ టీడీపీ ఆధిక్యం కనబరిచింది. ఆరు వార్డుల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయభేరి మోగించారు.

గుంతకల్లు మున్సిపాలిటీలో టీడీపీ ఘన విజయం సాధించడంతో కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. పలుచోట్ల పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ విజయోత్సవాలు నిర్వహించారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL