Kadiri: కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అర్షియా బాను విజయం!
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అర్షియా బాను 906 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ 27 వార్డులు దక్కించుకుంది.
Kadiri: కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అర్షియా బాను విజయం!
శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగింది. కదిరి మున్సిపాలిటీలో 44 వార్డులకు అభ్యర్థులు చైర్మన్ అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ మధ్య ప్రధాన పోటీగా తలపడ్డాయి. మొత్తం రౌండ్లు ముగిసేసరికి 44 వార్డులకు గాను 27 వార్డులలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా, 17 వార్డులలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు.
చివరి రౌండ్లు ముగిసేసరికి టీడీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ అర్షియా బాను వైసీపీ అభ్యర్థి అత్తార్ పర్విన్ పై 906 ఓట్లు మెజార్టీతో టీడీపీ చైర్మన్ అభ్యర్థి విజయభేరీ మోగించారు. దీంతో కదిరిలో తెలుగు తమ్ముళ్లు సంభరాలు చేసుకున్నారు.




