Tadipatri: రేపటి నుంచి తాడిపత్రిలో రాయితీపై BPT సన్న బియ్యం పంపిణీ

Tadipatri: తాడిపత్రి, పరిసర గ్రామాలకు నవంబర్ 22 నుంచి APSCSCL ద్వారా BPT సన్న బియ్యం పంపిణీ; కిలో రూ.49, 26 కిలోల బస్తా రూ.1,274 చొప్పున లభ్యం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Nov 2026 9:28 PM IST
Tadipatri
X

Tadipatri: రేపటి నుంచి తాడిపత్రిలో రాయితీపై BPT సన్న బియ్యం పంపిణీ

తాడిపత్రి: తాడిపత్రి మండలం మరియు పరిసర గ్రామాల ప్రజలకు రేపటి నుండి రాయితీ ధరకే నాణ్యమైన BPT సన్న బియ్యం పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (APSCSCL) ఆధ్వర్యంలో, అనంతపురము జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, మరియు జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, సహకారంతో, తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక సిఫార్సు మేరకు తాడిపత్రి మండలం మరియు పరిసర గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన BPT సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది.

పంపిణీ వివరాలు:

ప్రారంభ తేదీ: రేపటి నుండి (తేదీ: 22-11-2026 నుండి)

* పంపిణీ కేంద్రం: పాత తేరు సమీపంలో, మెయిన్ బజార్, తాడిపత్రి పట్టణం.

* ధర వివరాలు: కిలో BPT బియ్యం ధర రూ. 49/- చొప్పున, 26 కిలోల బస్తా రూ. 1,274/- లకు అందించబడును.

* పరిమితి* : ఒక రేషన్ కార్డుకు 26 కిలోల బియ్యం ప్యాకెట్ (ఒక బస్తా) చొప్పున పంపిణీ చేయబడును.

లబ్ధిదారులకు ముఖ్య గమనిక:

బియ్యం పొందగోరు రేషన్ కార్డుదారులు పంపిణీ కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా తమ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు జిరాక్స్/ఒరిజినల్ పత్రాలను వెంట తీసుకురావలెను.

బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తున్న ఈ నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ సదుపాయాన్ని తాడిపత్రి మండలం మరియు పరిసర గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్