Tadipatri: తాడిపత్రిలో స్థానిక ఎన్నికల దృష్ట్యా పోలీస్ అవుట్ పోస్టులు!

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థానిక ఎన్నికల వేళ పోలీసుల పటిష్ట చర్యలు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక అవుట్ పోస్టుల ఏర్పాటు చేసిన సీఐ, డీఎస్పీ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 Oct 2026 3:54 PM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రిలో స్థానిక ఎన్నికల దృష్ట్యా పోలీస్ అవుట్ పోస్టులు!

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తాడిపత్రి సీఐ ఆరోహణ రావు మాట్లాడుతూ పట్టణంలోని పలు కూడళ్లలో పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు.

తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ అవుట్ పోస్టుల ఏర్పాటు ద్వారా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు."

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్