Tadipatri: తాడిపత్రిలో పంచాయతీ ఎన్నికల వేళ సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల తనిఖీలు!

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు. గంగాదేవిపల్లి, సజ్జలదిన్నె గ్రామాల్లో రౌడీషీటర్ల ఇళ్ల సోదాలు. హెచ్చరించిన డీఎస్పీ చంద్రశేఖర్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Nov 2026 8:19 AM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రిలో పంచాయతీ ఎన్నికల వేళ సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల తనిఖీలు!

Tadipatri: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు – శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు. ఈరోజు ఉదయం DSP చంద్రశేఖర్ ఆధ్వర్యంలో CI నారాయణ రెడ్డి ,SI తమ సిబ్బందితో కలిసి తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామలైన గంగాదేవిపల్లి మరియు సజ్జలదిన్నె గ్రామాల్లో రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని రౌడీషీటర్ల ఇళ్లతో పాటు, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నట్లు గుర్తించిన సమస్యాత్మక వ్యక్తుల నివాసాలను తనిఖీ చేయడం జరిగింది.

రాబోయే పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా జరిగేలా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపడుతోంది. ఎన్నికల సమయంలో ఎవరైనా గొడవలకు పాల్పడినా, ప్రజా శాంతికి భంగం కలిగించినా, ఇతరులను బెదిరించినా లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

గ్రామాల్లో ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేయడమైనది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్