Tadipatri: తాడిపత్రిలో మున్సిపల్ నామినేషన్ల జోరు

Tadipatri: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో వార్డులకు 142, చైర్మన్ పదవికి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. 28న పోలింగ్, 30న కౌంటింగ్ ఉంటుందని కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Oct 2026 10:55 PM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రిలో మున్సిపల్ నామినేషన్ల జోరు

అనంతపురం జిల్లా: తాడిపత్రి మున్సిపాలిటీ వార్డు నెంబర్లు , చైర్మన్ పదవి నామినేషన్ ప్రక్రియ ఈరోజు పూర్తి అయ్యేసరికి BJP ఒకటి CPI ఒకటి TDP 86 YSR 54 మొత్తం 142 నామినేషన్లు. చైర్ పర్సన్ కొరకు 4 నామినేషన్లు దాఖలైనట్టు కమిషనర్ శివరామకృష్ణ మీడియాతో తెలిపారు.

అలాగే 21వ తేదీ మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ ఉప సవరణ చేసుకోవచ్చని. అదే రోజు మూడు గంటల తర్వాత చైర్ పర్సన్స్ వార్డు నెంబర్ జాబితా విడుదల చేస్తామని.

28వ తేదీనాడు పోలింగ్ ఉంటుందని 30వ తేదీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని. ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చైర్మన్ పదవికి డైరెక్ట్ గా ఓటు వేయచ్చని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్