Tadipatri: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Tadipatri: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 16 నుండి ప్రారంభం కానుందని, అక్టోబర్ 28న పోలింగ్ జరుగుతుందని కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు.
Tadipatri: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తాడిపత్రి: తాడిపత్రి మునిసిపల్ కమిషనర్ శివరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ... తాడిపత్రి మునిసిపల్ ఎన్నికల నామినేషన్లకు సర్వం సిద్ధం చేసామని, అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ 48 వార్డులకు 12 మంది ఎన్నికల అధికారుల నియామకం అని. చైర్మన్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక.. ప్రత్యేక ఎన్నికల అధికారి నియమించమని.
మునిసిపల్ కార్యాలయం 200 మీటర్ల పరిధిలో ర్యాలీలకు అనుమతి లేదు. ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు.. 7 చెక్పోస్టుల ఏర్పాటు చేశారు. అక్టోబర్ 19న నామినేషన్ల పరిశీలన.. 21న తుది అభ్యర్థుల జాబితా ఉంటుంది.
అక్టోబర్ 28న 48 వార్డులకు 96 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు.. సాయంత్రానికి ఫలితాల ప్రకటన చేస్తామని తెలిపారు.




