Anantapur: తాడిపత్రిలో డ్రై డే కార్యక్రమం.. 7వ వార్డులో చైర్‌పర్సన్ పర్యటన!

Anantapur:తాడిపత్రి 7వ వార్డులో డ్రై డే కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్‌పర్సన్ రేష్మా పర్వీన్, కమిషనర్ శివరామకృష్ణ పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

Surya Prakash, Tadipatri
Published on: 27 Nov 2026 12:07 PM IST
Anantapur
X

Anantapur: తాడిపత్రిలో డ్రై డే కార్యక్రమం.. 7వ వార్డులో చైర్‌పర్సన్ పర్యటన!

Anantapur: తాడిపత్రి పట్టణంలో డ్రై డే కార్యక్రమం – ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ రేష్మా పర్వీన్.తాడిపత్రి మాజీ MLA జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు MLA జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్రగుడి రేష్మా పర్వీన్ మరియు మున్సిపాలిటీ కమిషనర్ శివరామకృష్ణ డ్రై డే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 7వ వార్డు పరిధిలోని మణియార్ స్ట్రీట్, రాయచూర్ స్ట్రీట్, మెయిన్ బజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి, స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు పరిశుభ్రత, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

అనంతరం 7వ వార్డులోని అమ్మవారిశాల దేవాలయం మరియు పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే లక్ష్యంగా మున్సిపల్ పాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Surya Prakash, Tadipatri

Surya Prakash, Tadipatri