Tadipatri: తాడిపత్రిలో 30 మంది టీడీపీ కౌన్సిలర్లకు డిక్లరేషన్ ఫారాలు!
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీకి చెందిన 30 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ డిక్లరేషన్ ఫారాలు అందజేశారు.
Tadipatri: తాడిపత్రిలో 30 మంది టీడీపీ కౌన్సిలర్లకు డిక్లరేషన్ ఫారాలు!
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన 30 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలను పంపిణీ చేశారు.
తాడిపత్రి మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అసిస్టెంట్ అధికారి శివరామకృష్ణ ఈ ఫారాలను అభ్యర్థులకు అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 48 వార్డులకు గాను 30 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఈ వార్డుల్లో ప్రత్యక్ష పోటీ లేకుండానే ఎన్నికల ప్రక్రియలో కీలక దశ పూర్తయింది.




