Tadipatri: తాడిపత్రి: మున్సిపల్ నామినేషన్లు; డ్రోన్లతో భారీ భద్రత!

Tadipatri: అనంతపురం: తాడిపత్రి మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు డ్రోన్ కెమెరాలు, వజ్ర వాహనాలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Oct 2026 3:27 PM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రి: మున్సిపల్ నామినేషన్లు; డ్రోన్లతో భారీ భద్రత!

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది . నామినేషన్ల కేంద్రం మున్సిపల్ కార్యాలయం చుట్టూ ముళ్ళ కంచెలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అడిషనల్ ఎస్పీ అశ్విన్ మణదీప్ ఆధ్వర్యంలో తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్ పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

భద్రతలో భాగంగా వజ్ర వాహనాలను సైతం ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్