Tadipatri: తాడిపత్రి మున్సిపాలిటీలో బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ
Tadipatri: తాడిపత్రి పురపాలక సంఘంలో బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం; కమిషనర్ శివ రామ కృష్ణ, వైస్ చైర్‌పర్సన్ స్వప్న, అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ.
Tadipatri: తాడిపత్రి మున్సిపాలిటీలో బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ
తాడిపత్రి: తాడిపత్రి పురపాలక సంఘం కార్యాలయంలో ఈ రోజు బాల్య వివాహాలు, బాల్య దశలో జరిగే వివాహాలు మరియు బలవంతపు వివాహాల నిర్మూలనపై అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సబ్బి శివ రామ కృష్ణ , మున్సిపల్ వై. రేష్మా పర్వీన్ మరియు వైస్ చైర్ పర్సన్ టంగుటూరి స్వప్న మరియు ఇతర కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలికల విద్య, హక్కులు, భద్రత మరియు సమాన అవకాశాలను పరిరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.
బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి ఆటంకమని గుర్తిస్తూ, బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా, వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతి బాలబాలికకు విద్య, స్వేచ్ఛ, భద్రత మరియు సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేస్తాను. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించి, బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉంటాను."
బాల్య వివాహాలను అరికడదాం – బాలల భవిష్యత్తును కాపాడుదాం.




