Anantapur: బాల్య వివాహ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా తాడిపత్రిలో అవగాహన!

Anantapur: తాడిపత్రి ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 'బాల్య వివాహ ముక్త్ భారత్' అవగాహన సదస్సు నిర్వహించారు.

Surya Prakash, Tadipatri
Published on: 28 Nov 2026 1:23 PM IST
Anantapur
X

Anantapur: బాల్య వివాహ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా తాడిపత్రిలో అవగాహన!

Anantapur: బాల్య వివాహాల నిర్మూలనకు విద్యార్థులే కీలక శక్తి!ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమంతాడిపత్రి బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని, బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని పలువురు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.బాల్య వివాహ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా తాడిపత్రి MLA జె.సి. అస్మిత్ రెడ్డి , మాజీ MLA జె.సి. ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు తాడిపత్రి పట్టణంలోని ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సుధాకర్ గారి అధ్యక్షతన, 25, 24, 23, 32వ వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాల్య వివాహాల నిర్మూలన ఆవశ్యకత, బాల్య వివాహ నిరోధక చట్టం-2006లోని ముఖ్యమైన నిబంధనలు, బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాల గురించి అవగాహన కల్పించారు.బాల్యం చదువుల కోసం.. వివాహం వయోజన దశలోనే! అనే సందేశంతో విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తూ, బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలని విద్యార్థులకు వివరించారు.

అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు బాల్య వివాహాల నిర్మూలన అంశంపై ప్రసంగ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రసంగాల ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పోతుల గంగాధర్ యాదవ్, టింకర్ హుస్సేన్ భాష, టింకర్ హబీబుల్లా, రషీదా బేగం, ప్రకాశం హైస్కూల్ ఉపాధ్యాయులు, టైలర్స్ కాలనీ-01, టైలర్స్ కాలనీ-02 సచివాలయ సిబ్బంది, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, టైలర్స్ కాలనీ ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.బాల్య వివాహాలకు స్వస్తి పలికి, ప్రతి బాలికకు విద్యా హక్కు, స్వేచ్ఛ, భద్రమైన భవిష్యత్తు కల్పించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు.

Surya Prakash, Tadipatri

Surya Prakash, Tadipatri