Tadipatri: ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల నిర్వహణకు కఠిన ఆంక్షలు!

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Oct 2026 6:40 AM IST
Tadipatri
X

Tadipatri: ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల నిర్వహణకు కఠిన ఆంక్షలు!

Tadipatri: తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఆంక్షలు – 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు. రోజు రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సంబంధిత చట్టపరమైన నిబంధనల ప్రకారం ఆంక్షలు అమలు చేస్తున్నట్లు. నామినేషన్ కేంద్రాల వద్ద, పరిసర ప్రాంతాల్లో నలుగురికి మించి వ్యక్తులు గుమిగూడరాదని సూచించారు.

నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థితో పాటు నిబంధనల ప్రకారం అనుమతించబడిన ఇద్దరు ప్రతిపాదకులు (ప్రపోజర్స్ ) మాత్రమే రావాలని స్పష్టం చేశారు. ఇతర వ్యక్తులు గుంపులుగా రావడానికి అనుమతి ఉండదని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని తాడిపత్రి డీఎస్పీ తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్