Pamidi: పామిడి మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా శ్రీనివాసరావు బాధ్యతలు!

Pamidi: పామిడి మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా ఎస్టీ సంక్షేమ అధికారి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 25 Sept 2026 5:52 PM IST
Pamidi
X

Pamidi: పామిడి మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా శ్రీనివాసరావు బాధ్యతలు!

Pamidi: పామిడి మండల పరిషత్ అధ్యక్షులు మరియు ఎంపీటీసీల పదవీకాలం 23 సెప్టెంబర్ 2026తో ముగియడంతో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పామిడి మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా షెడ్యూల్డ్ తెగల సంక్షేమ అధికారి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేక అధికారికి ఘన స్వాగతం పలికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీనివాసరావు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టి, మండల పరిషత్ పరిధిలోని వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL