Sathya Sai: సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ జెడ్పీ ఛైర్మన్గా వజ్ర భాస్కర్ రెడ్డి?
Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా వజ్ర భాస్కర్ రెడ్డి పేరు ఖరారు. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా అవకాశమిచ్చిన అధిష్టానం.
Sathya Sai: సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ జెడ్పీ ఛైర్మన్గా వజ్ర భాస్కర్ రెడ్డి?
Sathya Sai: సత్య సాయి జిల్లా వైసీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా వైసిపి నేత వజ్ర భాస్కర్ రెడ్డి పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా జడ్పీ చైర్మన్ స్థానాన్ని జనరల్ కి కేటాయించడంతో వైసిపి అధిష్టానం జెడ్పి అభ్యర్థిగా వజ్ర భాస్కర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుండి వజ్ర భాస్కర్ రెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్నారు.
గతంలో 2019 ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడిన ఆయన అప్పట్లో వైసీపీని వీడి బిజెపిలో చేరారు.బిజెపి లో కూడా జిల్లా అద్యక్షులుగా పనిచేసి 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.వైసీపీలో ఆయనకు రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీగా క్రియాశీలక పదవి ఇచ్చిన అధిష్టానం, వజ్ర భాస్కర్ రెడ్డి పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని గతంలో లోటును భర్తీ చేసేలా ఆయనకి జడ్పీ చైర్మన్గా అవకాశము కల్పించింది. దీంతో పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




