Lepakshi: లేపాక్షి శిల్పకళా వైభవానికి పేజావర్ పీఠాధిపతి ప్రశంసలు!

Lepakshi: శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి శ్రీ దుర్గా వీరభద్రస్వామి ఆలయాన్ని పేజావర్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ సందర్శించి ఆలయ శిల్పకళా వైభవాన్ని కొనియాడారు.

RAMANJANEYULU, HINDUPUR
Published on: 19 Nov 2026 12:01 PM IST
Lepakshi
X

Lepakshi: లేపాక్షి శిల్పకళా వైభవానికి పేజావర్ పీఠాధిపతి ప్రశంసలు!

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చారిత్రక లేపాక్షి శ్రీ దుర్గా వీరభద్రస్వామి ఆలయాన్ని పేజావర్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ శిల్పకళా వైభవాన్ని, విజయనగర రాజుల కాలంనాటి అపురూప కళా సంపదను తిలకించి ముగ్ధులయ్యారు.

ఒకే పైకప్పుపై ఇన్ని అద్భుతమైన దేవతామూర్తుల శిల్పాలను చూడటం విశేషమని, ఆనాటి శిల్పుల కళా నైపుణ్యం, సృజనాత్మక ప్రతిభ అసాధారణమని ప్రశంసించారు. ఆలయానికి విచ్చేసిన స్వామీజీకి అర్చకులు, ఆలయ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం దుర్గాదేవి, వీరభద్రస్వామి, రఘునాథస్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రాంగణంలోని శిల్పాలు, విజయనగర సామ్రాజ్య కళా వైభవం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని కొనియాడారు. సనాతన ధర్మ ప్రచారానికి ఆర్థిక చేయూత పెజావర్ మఠం ఆధ్వర్యంలో సనాతన ధర్మ ప్రచారం, ధార్మిక విద్యాబోధన లక్ష్యంగా నిర్వహిస్తున్న పాఠశాలల భవన నిర్మాణానికి లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ పరిగి వేణుగోపాలరావు రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించారు.

ఈ మేరకు రూ.4 లక్షల చెక్కును పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీకి అందజేశారు. భావితరాలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మ విలువలను పరిచయం చేసే విద్యాసంస్థల అభివృద్ధికి సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. చారిత్రక ఆలయ శిల్పకళా వైభవానికి ఆధ్యాత్మిక పీఠాధిపతి ప్రశంసలు లభించడంతో పాటు, సనాతన ధర్మ పాఠశాలల నిర్మాణానికి ఆర్థిక చేయూత అందడం లేపాక్షి పర్యటనలో ప్రత్యేకతగా నిలిచింది.

RAMANJANEYULU, HINDUPUR

RAMANJANEYULU, HINDUPUR