Dharmavaram: ఘనంగా పాత్రికేయుడు వైష్ణవ శ్రీనివాసు సన్మాన కార్యక్రమం!

Dharmavaram: ధర్మవరానికి చెందిన సీనియర్ పాత్రికేయులు వైష్ణవ శ్రీనివాసుకు హైదరాబాద్ ‘మేఘా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ‘స్వర్ణ నంది’ అవార్డు లభించింది.

NAGENDRA, DHARMAVARAM
Published on: 30 Sept 2026 2:33 PM IST
Dharmavaram
X

Dharmavaram: ఘనంగా పాత్రికేయుడు వైష్ణవ శ్రీనివాసు సన్మాన కార్యక్రమం!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు శ్రీ వైష్ణవ శ్రీనివాసులకి హైదరాబాద్ కు చెందిన "మేఘా ఫౌండేషన్"సంస్థ స్వర్ణ నంది అవార్డు తో సత్కరించింది..

సుదీర్ఘకాలం పాత్రికేయ రంగంలో శ్రీనివాసులు తన కలం ద్వారా ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసినందుకు & పాత్రికేయ రంగం ద్వారా సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ " స్వర్ణ నంది "అవార్డుతో గత ఆదివారం గౌరవించింది.

ఈరోజు ధర్మవరం ఎన్జీవో కార్యాలయంలో శ్రీనివాసులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయ ఇన్చార్జి

శ్రీ కగ్గోలు హరీష్ బాబు విచ్చేసి పెద్దలు పాత్రికేయుల సమక్షంలో శ్రీనివాసులు గారిని శాలవా పూలమాల తలపాగాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యులతో పాటు పాత్రికేయులు హాజరయ్యారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM