Hindupur: హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి మైనార్టీలకే ఇవ్వాలి!
Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో 18 మంది ముస్లిం కౌన్సిలర్లు గెలిచినందున, వైస్ చైర్మన్ పదవిని మైనార్టీలకే కేటాయించాలని ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యే బాలకృష్ణను కోరారు.
Hindupur: హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి మైనార్టీలకే ఇవ్వాలి!
హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ కి చెందిన 18 మంది కౌన్సిలర్ గా ఎన్నిక కావడంతో మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి ఆనవాయితీగా హిందూ సామాజిక వర్గానికి చెందిన చైర్మన్ పదవి ఉంటే వైస్ చైర్మన్ పదవి మైనార్టీలకు ఇచ్చి గౌరవిస్తూ వస్తున్నారు.
ఈ తరుణంలోనే ఈసారి కూడా ముస్లిం మైనార్టీ కి చెందిన ఎవరికో ఒకరికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని ముస్లిం మత పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా రెండు సంవత్సరాల కాలవ్యవధిలోనే శాసనసభ ఎన్నికలు ఉన్నందున ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముస్లిం మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాలని వారు కోరారు.




