Hindupur: హిందూపురంలో టీడీపీకి షాక్: వైసీపీలోకి భారీగా చేరికలు!

Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం 35వ వార్డులో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ కౌన్సిలర్ జహిరుద్దీన్ కుమారుడు అంజాద్, పలువురు కార్యకర్తలు వైసీపీలో చేరారు.

RAMANJANEYULU, HINDUPUR
Published on: 23 Oct 2026 10:05 PM IST
Hindupur
X

Hindupur: హిందూపురంలో టీడీపీకి షాక్: వైసీపీలోకి భారీగా చేరికలు!

హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డ్ కు చెందిన మాజీ కౌన్సిలర్ స్వర్గీయ జహిరుద్దీన్ కుమారుడు షేక్ అంజాద్, కుటుంబ సభ్యులతో పాటు పలువురు టిడిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకుడు వేణు రెడ్డి, చైర్ పర్సన్ అభ్యర్థి షాజియా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారికి కండవాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు.*అదేవిధంగా అదే వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తున్న చైర్పర్సన్ అభ్యర్థి D.షాజియా, స్థానిక కౌన్సిలర్ అభ్యర్థి షేక్ ఫర్జానా ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైయస్సార్సీపి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

RAMANJANEYULU, HINDUPUR

RAMANJANEYULU, HINDUPUR