Lepakshi: లేపాక్షిలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సీఐ!
Lepakshi: శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని పోలింగ్ కేంద్రాలను హిందూపురం రూరల్ సర్కిల్ సీఐ జనార్ధన్ తనిఖీ చేసి, మౌలిక సదుపాయాలు మరియు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
Lepakshi: లేపాక్షిలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సీఐ!
Lepakshi: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా హిందూపురం రూరల్ సర్కిల్ సీఐ జనార్ధన్ లేపాక్షి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రహరీ గోడ, విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు.
పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.




