Kadiri: కదిరి రూరల్ మండల ఎంపీపీగా టీడీపీ నేత దీపా బాయి ఎన్నిక!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా తెలుగుదేశం పార్టీకి చెందిన దీపా బాయి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కీలక పాత్ర పోషించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 19 Nov 2026 3:09 PM IST
Kadiri
X

Kadiri: కదిరి రూరల్ మండల ఎంపీపీగా టీడీపీ నేత దీపా బాయి ఎన్నిక!

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి రూరల్ మండల ఎంపీపీ ఎన్నిక ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కదిరి రూరల్ మండల ఎంపీపీ ఎన్నికకు సంబంధించి నిర్వహించిన సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులంతా గైర్హాజరు కాగా, తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా కదిరి రూరల్ మండల ఎంపీపీగా తెలుగుదేశం పార్టీకి చెందిన దీపా బాయి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ కీలక పాత్ర పోషిస్తూ రాజకీయంగా చక్రం తిప్పారు.

పార్టీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించారు. ఎంపీపీగా ఎన్నికైన దీపా బాయికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI