Hindupur: కోడూరు, కోడికొండ గ్రామాల్లో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్!
Hindupur: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు హిందూపురం డీఎస్పీ రవిబాబు, ఎస్ఐ శ్రీధర్ చిలమత్తూరు మండలం కోడూరు, కోడికొండ గ్రామాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.
Hindupur: కోడూరు, కోడికొండ గ్రామాల్లో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్!
హిందూపూర్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా హిందూపురం SDPO రవిబాబు స్వయంగా, ఎస్ఐ శ్రీధర్ పోలీసు సిబ్బందితో కలిసి చిలమత్తూరు మండల పరిధిలోని కోడూరు, కోడికొండ గ్రామాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గ్రామస్తులతో మాట్లాడి ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.
పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన నేరాలకు, గొడవలు, ఘర్షణలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.




