Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా గోల్డ్ షాట్ బాల్ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ!

Sathya Sai: తెనాలిలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ పోటీలకు వెళ్లే శ్రీ సత్యసాయి జిల్లా గోల్డ్ షాట్ బాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ. లోగో ఆవిష్కరణ.

P.RAHAMTULLA, KADIRI
Published on: 15 Oct 2026 6:50 PM IST
Sathya Sai
X

Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా గోల్డ్ షాట్ బాల్ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ!

Sathya Sai: శ్రీ ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ నందు గుంటూరు జిల్లా తెనాలి లో 16, 17, 18,తేదీలలో జరిగేటువంటి సబ్ జూనియర్స్ రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లేటటువంటి క్రీడాకారులకు శ్రీ ఓబులేశ్వర్ అకాడమీ నందు క్రీడా దుస్తులు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా అద్యక్షులు ఓబులేష్, కార్యదర్శి ప్రసన్నకుమార్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలలో కూడా మన జిల్లా ముందు ఉండాలని క్రీడలు మానసికల్లాసాన్ని పెంపొందిస్తాయని, విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సత్య సాయి జిల్లా యొక్క గోల్ షాట్ బాల్ లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ట్రెజరర్ జగదీష్ నాయక్ జాయింట్ సెక్రెటరీ రవిశంకర్ పాల్గొన్నారు

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI