Sri Sathya Sai: నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పోలీసు నిఘా
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలోని 6 మున్సిపల్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
Sri Sathya Sai: నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పోలీసు నిఘా
శ్రీ సత్యసాయి జిల్లా: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నామినేషన్ కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ, శాంతియుత వాతావరణం నెలకొనేందుకు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా పోలీసు శాఖ కోరింది.




