Dharmavaram: ధర్మవరం ఎంపీపీగా తాడిమర్రి శ్రీనివాసులు ఏకగ్రీవ ఎన్నిక!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండల ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి తాడిమర్రి శ్రీనివాసులు, వైస్ ఎంపీపీగా బీజేపీ ఎంపీటీసీ అంగజాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Dharmavaram: ధర్మవరం ఎంపీపీగా తాడిమర్రి శ్రీనివాసులు ఏకగ్రీవ ఎన్నిక!
ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గంలోని మూడు ఎంపీపీ పదవులు టీడీపీ తీసుకుంటుండగా మిగిలిన ధర్మవరం ఎంపీపీ పదవి బీజేపీ ఎంపీటీసీగా విజయం సాధించిన అంగజాల రాజుకు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. మంత్రి సత్య కుమార్ యాదవ్ సైతం అంగజాల రాజుకు ఎంపీపీ ఇవ్వాల్సిందిగా సూచించారు. కానీ చివరి నిమిషంలో ఎంపీపీ పదవి టీడీపీ నాయకుడు గొట్లూరు ఎంపీటీసీగా విజయం సాధించిన తాడిమర్రి శ్రీనివాసులకు ఇచ్చారు.
వైస్ ఎంపీపీ అంగజాల రాజుకు ఇవ్వడం జరిగింది. పదవి ఏదైనా ముందు ప్రజాసేవకే ప్రాధాన్యతనిస్తానని వైస్ ఎంపీపీ అంగజాల రాజు పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన కూటమి అగ్ర నాయకులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.




