Dharmavaram: ధర్మవరం మండల ఎంపీపీ పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని నాలుగు ఎంపీపీ స్థానాల్లో ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి టీడీపీకి దక్కగా, ధర్మవరం మండల ఎంపీపీ పదవి బీజేపీ ఖాతాలోకి వెళ్లనుంది.

NAGENDRA, DHARMAVARAM
Published on: 13 Nov 2026 3:29 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరం మండల ఎంపీపీ పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం!

ధర్మవరం: సత్యసాయి జిల్లా ధర్మవరం మండల MPP బీజేపీ కి ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నారు.ఇటీవల జరిగిన MPTC ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం లోని ముదిగుబ్బ తాడిమర్రి బత్తలపల్లి ధర్మవరం రూరల్ లో కూటమి మెజారిటీ సాధించి నాలుగు MPP లకు అర్హత సాధించింది. ముదిగుబ్బ తాడిమర్రి బత్తలపల్లి MPP లు టీడీపీ తీసుకోగా మిగిలిన ధర్మవరం బీజేపీ కి ఇస్తున్నట్లు సమాచారం. ధర్మవరం మండలంలో 13 MPTC స్థానాలు ఉండగా వైసీపీ 6 స్థానాలు టీడీపీ 6 మిగిలిన ఒకటి పోతుకుంట నుండీ బీజేపీ తరపున ఎంపీటీసీగా అంగజాల రాజు విజయం సాధించారు.

గొట్లూరు నుండీ టీడీపీ MPTC గా గెలుపొందిన శ్రీనివాసులు MPP గా తనకే అవకాశం ఇస్తున్నట్లు చెప్తున్నప్పటికీ కూటమి ధర్మంలో భాగంగా వివిధ సమీకరణాలను అనుసరించి బీజేపీ అభ్యర్థి అంగజాల రాజు ను ధర్మవరం మండల MPP గా దాదాపు నిర్ధారించినట్లు విశ్వసనీయ సమాచారం.అటు మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం నియోజకవర్గంలోని మూడు MPP స్థానాలు టీడీపీ కి పోగా మిగిలిన ఏకైక ధర్మవరం మండల MPP స్థానాన్ని బీజేపీ కి ఇవ్వాల్సిందే అంటున్నట్లు తెలిసింది.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM