Penukonda: గొల్లపల్లి జలాశయంలో ఐదుగురు మహిళల దుర్మరణం!
Penukonda: పెనుకొండ గొల్లపల్లి జలాశయంలో బురదలో ఇరుక్కుని ఐదుగురు మహిళలు నీట మునిగి మృతి చెందారు. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
Penukonda: గొల్లపల్లి జలాశయంలో ఐదుగురు మహిళల దుర్మరణం!
పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన ముస్లిం యువతులు మరి కొంతమంది తో విహారయాత్ర కోసం గొల్లపల్లి జలాశయానికి వెళ్లారు. అయితే అక్కడ నీటిలో దిగిన సమయంలో బురద ఎక్కువగా ఉండడంతో ఇరుక్కున్న యువతులు ఒకరికొకరు పట్టుకొని భయభ్రాంతులకు గురై ఐదు మంది యువతులు నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
వీరంతా పెనుకొండ ప్రాంతానికి చెందిన దర్గాపేట వాసులుగా గుర్తింపు. వీరులో 17 సంవత్సరాలలోపుల ఒకరు, 29 సంవత్సరాల యువతులు ఇద్దరు, 45 సంవత్సరాల మహిళలు ఇద్దరు ఉన్నారు. మొత్తము 8 మంది యువతులు ఉండగా ఐదు మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు మృతుల్లో ఒకరు మైనర్ బాలికతో పాటు నలుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం.. పెనుకొండ దర్గాపేట, ఇసుకవంక వాసులుగా గుర్తింపు మృతులను పెనుకొండ పట్టణంలోని దర్గాపేట, ఇసుకవంక ప్రాంతాలకు చెందిన అశ్వని (20), గాయత్రి (45), పుష్ప లత(35), మాహిన్ (16), హాసిన్ (48)గా గుర్తింపు .




