Anantapur: అనంతపురంలో అజేష్ బాబుకు సోము వీర్రాజు మద్దతు

Anantapur: అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి అజేష్ బాబుకు మద్దతుగా బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు విస్తృత ప్రచారం నిర్వహించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 29 Oct 2026 5:02 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో అజేష్ బాబుకు సోము వీర్రాజు మద్దతు

అనంతపురం: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు.మేయర్ అభ్యర్థి అజేష్ బాబుకు మద్దతుగా నగరంలోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు.అనంతరం బీజేపీ కార్యాలయంలో సోము వీర్రాజు సమక్షంలో పలువురు పార్టీలో చేరారు.

వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీపై తీవ్ర విమర్శలు చేశారు.వైసీపీ అంటే బాంబులు, గొడ్డలి రాజకీయాలతో ముడిపడిన పార్టీ అని వ్యాఖ్యానించారు.175 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన జగన్‌ను ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేశారని అన్నారు.

అనంతపురంలో జల్‌జీవన్ మిషన్, యూడీఎఫ్ పథకాల అమలు గురించి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.నగరానికి ఏం అభివృద్ధి చేశారని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.కడప, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల అభివృద్ధి గురించి ప్రస్తావించిన సోము వీర్రాజు..అనంతపురం నగరానికి కూడా విమానాశ్రయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ప్రజాస్వామ్యం గురించి వైఎస్ జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా బెదిరించిన సందర్భాలు లేవా అని ప్రశ్నించారు.

బాబాయి హత్య కేసును ప్రస్తావిస్తూ జగన్‌పై రాజకీయ విమర్శలు చేశారు.మొత్తంగా అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా సోము వీర్రాజు ప్రచారం నిర్వహించడంతో నగరంలో ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM