Kadiri: కదిరిలో అక్రమ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు ఆరుగురి అరెస్ట్!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఆన్‌లైన్ బెట్టింగ్ ముట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ నగదును స్వాధీనం చేసుకున్నారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 9 Oct 2026 2:33 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో అక్రమ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు ఆరుగురి అరెస్ట్!

Kadiri: కదిరిలో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అనుమతులు లేని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తూ కమీషన్లు పొందుతున్న ముఠాపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 6 లక్షల 77 వేల 400 రూపాయల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, తొమ్మిది బ్యాంకు పాస్‌బుక్కులను స్వాధీనం చేసుకున్నారు.

టెలిగ్రామ్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకున్న ప్రధాన నిర్వాహకులు.. స్థానిక యువకులను ఈ వ్యవహారంలోకి దింపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బ్యాంకు ఖాతాల ద్వారా జరిగే నగదు లావాదేవీలకు ప్రతి లక్ష రూపాయలకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు కమీషన్ పొందినట్లు గుర్తించారు.

కదిరి పట్టణంలోని కుటాగుళ్ల గ్రామ శివారులో అక్టోబర్ 8వ తేదీన పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిర్వాహకులుగా అనుమానిస్తున్న మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు తమ బ్యాంకు ఖాతాలు, పాస్‌బుక్కులు, ఏటీఎం కార్డులు, నగదు బదిలీ వివరాలను ఇతరులకు అందించవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఇలాంటి అక్రమ లావాదేవీలకు సహకరిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ లేదా సైబర్ మోసాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 112 లేదా సైబర్ నేరాల ఫిర్యాదు నంబరు 1930కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI