Kadiri: కదిరిలో టీడీపీకి షాక్: వైఎస్సార్సీపీలోకి 70 కుటుంబాలు
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ 14వ వార్డుకు చెందిన 70 టీడీపీ కుటుంబాలు నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి.
Kadiri: కదిరిలో టీడీపీకి షాక్: వైఎస్సార్సీపీలోకి 70 కుటుంబాలు
కదిరి: సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ 14వ వార్డుకు చెందిన మైనుద్దీన్ ఆధ్వర్యంలోటీడీపీకి చెందిన 70 కుటుంబాలు వైస్సార్సీపీలోకి చేరారు. కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి. ఎస్. మక్బూల్ గారు పార్టీలో చేరిన వారికి వైస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు విషయంలో తాము నిరాశకు గురయ్యామని, మహిళలకు సంబంధించిన సమస్యలు మరియు ప్రజా సంక్షేమంపై ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో వైస్సార్సీపీ వైపు అడుగులు వేస్తున్నామని నూతనంగా పార్టీలో చేరిన కుటుంబాలు తెలిపారు.
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంపై విశ్వాసంతో, ఆయన ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారం మరియు సంక్షేమమే ప్రధానంగా ఉండే రాజకీయాన్ని కోరుకుంటూ వైస్సార్సీపీ లో చేరుతున్నామని వారు తెలిపారు.
అదే విధంగా ఇటీవల టీడీపీలోకి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తిరిగి సొంత గూటికి చేరడం జరిగిందని సమన్వయకర్త మక్బుల్ అన్నారు.




