Rayadurgam: రాయదుర్గంలో కాలువ భరత్ జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం!
Rayadurgam: రాయదుర్గంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్ ప్రచారం నిర్వహించి, టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Rayadurgam: రాయదుర్గంలో కాలువ భరత్ జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం!
Rayadurgam: రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా పట్టణంలోని 18 వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీ రామ్ రెడ్డి మరియు చైర్మన్ అభ్యర్థి టంకాశాల హనుమంతు తరఫున ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్ ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ తమ మద్దతు తెలియజేశారు.
ఈ సందర్భంగా కాలువ భరత్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీకి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందని తెలిపారు. ‘టీడీపీకే మా ఓటు’ అంటూ ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని వివరించారు. అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
రాయదుర్గం పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కాలువ భరత్ కోరారు. 40 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులతో పాటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి టెంకశాల హనుమంతును అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి మద్దతు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




