Raptadu: రాప్తాడులో విద్యార్థినిపై దాడి ఘటన తీవ్రంగా కలచివేసింది: ఎమ్మెల్యే!
Raptadu: రాప్తాడులో విద్యార్థినిపై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్.
Raptadu: రాప్తాడులో విద్యార్థినిపై దాడి ఘటన తీవ్రంగా కలచివేసింది: ఎమ్మెల్యే!
రాప్తాడు: రాప్తాడులో విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
అభం శుభం తెలియని విద్యార్థినిపై ఇలాంటి దాడి జరగడం హృదయవిదారకమని, బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




