Puttaparthi: పుట్టపర్తిలో సాయి గోకులం పార్క్, ఫుడ్ కోర్ట్ ప్రారంభం!
Puttaparthi: పుట్టపర్తిలో సాయి గోకులం పార్క్, ఫుడ్ కోర్ట్ ప్రారంభం: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభోత్సవం.
Puttaparthi: పుట్టపర్తిలో సాయి గోకులం పార్క్, ఫుడ్ కోర్ట్ ప్రారంభం!
పుట్టపర్తి: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ డిపో సమీపంలో నూతనంగా నిర్మించిన ‘సాయి గోకులం పార్క్’, ‘ఫుడ్ కోర్ట్’ ప్రారంభమయ్యాయి. కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. పుట్టపర్తి పట్టణ ప్రజలతో పాటు యాత్రికులకు ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని అందించేందుకు సాయి గోకులం పార్క్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదంగా సమయం గడిపేలా పార్క్‌లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.
సందర్శకులకు నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉండేలా ఫుడ్ కోర్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ఆర్టీసీ డిపో సమీపంలో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. పట్టణవాసులు, పర్యాటకులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.




