Puttaparthi: సత్యమ్మ ఆలయ పూజలతో మొదలైన జనసేన ప్రచారం!

Puttaparthi: పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూటమి మద్దతుతో జనసేన నేత మేకల ఈశ్వర్ సత్యమ్మ ఆలయంలో పూజల అనంతరం గడపగడపకూ ప్రచారం ప్రారంభించారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 23 Oct 2026 1:10 PM IST
Puttaparthi
X

Puttaparthi: సత్యమ్మ ఆలయ పూజలతో మొదలైన జనసేన ప్రచారం!

Puttaparthi: పుట్టపర్తి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కూటమి పార్టీలు బలపరిచిన జనసేన అభ్యర్థి మేకల ఈశ్వర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పట్టణంలోని గ్రామదేవత సత్యమ్మ ఆలయంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

గత కొన్ని రోజులుగా కూటమి పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేదంటూ ప్రచారం సాగిన నేపథ్యంలో, మేకల ఈశ్వర్ ప్రచారంలో మూడు పార్టీల నాయకులు కలిసికట్టుగా పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రెట్టించిన ఉత్సాహంతో నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా మేకల ఈశ్వర్ గడపగడపకు వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం పుట్టపర్తి అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని, పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయాలంటే తనను మున్సిపల్ చైర్మన్‌గా గెలిపించాలని కోరారు.

గత వైసీపీ పాలనలో పట్టణంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని పేర్కొంటూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పుట్టపర్తి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ నాయకులు మాట్లాడుతూ, కూటమి అభ్యర్థి మేకల ఈశ్వర్‌ను గెలిపించుకునేందుకు సమష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI