Puttaparthi: కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది మహాధర్నా రెండో రోజుకు చేరిక!

Puttaparthi: శ్రీ సత్యసాయి పుట్టపర్తిలో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ వైద్య ఆరోగ్య సిబ్బంది మహాధర్నా రెండో రోజుకు చేరింది. సీఐటీయూ మద్దతు తెలిపింది.

S.Firoz, Sri Sathya Sai
Published on: 8 Oct 2026 2:28 PM IST
Puttaparthi
X

Puttaparthi: కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది మహాధర్నా రెండో రోజుకు చేరిక!

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DMHO) కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ సిబ్బంది చేపట్టిన మహాధర్నా రెండో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ సిబ్బంది ఆందోళన కొనసాగించారు. రెండో రోజు మహాధర్నాకు CITU, వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు ప్రకటించి, ఆందోళనలో పాల్గొని కాంట్రాక్ట్ సిబ్బందికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి సాంబశివ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కాంట్రాక్ట్ సిబ్బంది కీలకంగా పనిచేస్తున్నప్పటికీ, వారి సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు.

ఉద్యోగ భద్రత, వేతనాలు, సమాన పనికి సమాన వేతనం తదితర న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను పరిష్కరించే వరకు వారి పోరాటానికి కార్మిక సంఘాలు అండగా ఉంటాయని తెలిపారు.

మహాధర్నా రెండో రోజు కూడా కాంట్రాక్ట్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని వారు కోరారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai